ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.o అంటే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక తాను ముందుగా ఇచ్చే ప్రయారిటీ పార్టీ కార్యకర్తలే అని మరోసారి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెడిపోయిన రాజకీయాల్లో మీరు తులసి మొక్కలా నిలిచారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్ అయినా మీరు సీఎం చంద్రబాబు నాయుడు కు రాజకీయం ఎలా చేయాలని నేర్పించినందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. జగన్ 2.0లో మాత్రం మొట్టమొదటి పీఠం కార్యకర్తలకే.. ఇది కచ్చితంగా చెబుతున్నాను. వైసీపీ కార్యకర్తల బాధలు, కష్టాలను స్వయంగా చూస్తున్నాను. అందుకే టాప్ ప్రియారిటీ కార్యకర్తలే ఇస్తా.. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసిపెట్టుకోండి. మనం అధికారంలోకి వచ్చాక వారికి సినిమా చూపిస్తానని.. ఆ సినిమా మామూలుగా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్.