తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సెలవుల్లో ఉన్నారు. ఆయన స్థానంలో తాత్కాళికంగా ఏసీబీ డీజీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజనీ కుమార్ ఇన్ ఛార్జీ డీజీపీ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆనారోగ్య కారణాలతో రెండు వారాల పాటు మహేందర్ రెడ్డి మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు ఆయన సెలవుల్లో ఉండనున్నారు. కాగ మహేందర్ రెడ్డి తిరిగి వచ్చి.. బాధ్యతలు స్వీకరించేంత వరకు ఇన్ ఛార్జీ డీజీపీ గా అదనపు బాధ్యతలను ఏసీబీ డీజీ అంజనీ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దానికి సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేశారు. దీంతో ఏసీబీ డీజీ అంజనీ కుమార్.. ఇన్ ఛార్జీ డీజీపీ తన అదనపు బాధ్యతలను స్వీకరించారు. కాగ డీజీపీ మహేందర్ రెడ్డి.. డీజీపీ గా బాధ్యతులు తీసుకున్న నాటి నుంచి సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మేడారం జాతరకు కూడా భద్రత విషయాలను దగ్గర ఉండి మరీ చూసుకున్నారు.