మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న మాటలకు, చేస్తున్న అప్పులకు అంతే లేదని యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ సందర్బంగా యనమల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రగతిపథంలో నడిపిన నవ్యాంధ్రను జగన్ సర్వనాశనం చేశారని అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు యనమల. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రజల మధ్య కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టారని, రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేశారని పంట రుణాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం హయాంలో రాష్టాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తే.. జగన్ ప్రభుత్వం లో అబివృద్ది కుంటుపడిందని ఎద్దేవా చేసారు యనమల.
తెలుగు దేశం హయాంలో సున్నా వడ్డీ కింద రాయితీ రూ.2 వేల కోట్లు ఇస్తే దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ. 487 కోట్లకు కోత కోసిందని యనమల విమర్శించారు. చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే స్ప్రేయర్లు, డ్రిప్ ఇరిగేషన్, పవర్ టిల్లర్లు, యంత్ర పరికరాల సరఫరాను నిలిపేశారన్నారు యనమల. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యం కూడా చేయడం లేదని అందువల్ల పేదవాడికి సరైన వైద్యం అందడం లేదని ఆయన తన ఆవేదనను వ్యక్త పరిచారు. 26 జిల్లాల అభివృద్ధికి ఉపయోగపడే అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని విశాఖలో విలువైన ప్రజల భూములు లాక్కోవడమే ఉత్తరాంధ్రకు చేసిన మేలా? అని యనమల జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు యనమల.