అవార్డుల పేరుతో వలంటీర్లకు రూ. 485.44 కోట్లు దోచిపెట్టారు – యనమల

-

ఏపీ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. జగన్ కన్నింగ్ నెస్ ఐడియాలజీతో బిజినెస్ చేస్తున్నారు… అవార్డుల పేరుతో వలంటీర్లకు రూ. 485.44 కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల.

జగన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని వలంటీర్లకిస్తూ వారి నుంచే డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తోంది..జగన్ ఏం చేసినా ప్రభుత్వ ఖజానాను తను, తన మనుషులు దోచుకునేందుకే అన్నది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్దమవుతోందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విదేశీ విద్య, అన్నక్యాంటీన్, దుల్హన్ పధకం, ఆధరణ పధకాలు రద్దు చేశారు… ప్రజలపై పన్నుల రూపంలో మోయలేని భారాలు మోపుతోందని మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల.

రాష్ట్ర రెవెన్యూ రాబడులతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతోంది… రాష్ట్రంలోని పరిస్థితి చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news