ఓటీటీలోకి వచ్చేసిన యాత్ర 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

-

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటించిన తాజా చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మిస్తున్నారు.రాజశేఖర్ రెడ్డి మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అనే విషయాలను ఈ చిత్రం లో చూపించారు.

అయితే యాత్ర 2 ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి లోనే యాత్ర 2 ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగగా చివరికి ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్‌ నటించారు. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా పాటలు కూడా వర్కౌట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version