వైసీపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధుల బస్సు యాత్ర నిర్వహించేందుకు వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధుల బస్సు యాత్ర నిర్వహించనుంది వైసీపీ పార్టీ.
సభల ఏర్పాటు, బస్సు రూట్ మ్యాప్ పై నిన్న సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అనుకున్నా.. రేపు దీనిపై క్లారిటీ రానుంది. ఈ సమావేశంలో.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, చెల్లుబోయిన వేణు, సజ్జల, సీఎంఓ అధికారులు హాజరు అయ్యారు.
అనంతరం జిల్లా కు ఒక బీసీ సదస్సు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 26 బీసీ సదస్సుల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. దేశంలో నే సోషల్ ఇంజనీరింగ్ పెద్ద ఎత్తున చేస్తున్న ప్రభుత్వంగా బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేయనుంది.