ప్ర‌తిరోజు జాగింగ్ చేస్తున్నారా.. ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!

-

స‌హజంగా ఎక్కువ శాతం మందికి మార్నింగ్ లేవ‌గానే జాగింగ్ చేసే అల‌వాటు ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక వ్యాయామం అవ‌సం. ఎటువంటి ఖ‌ర్చు లేని వ్యాయామాల్లో జాగింగ్ ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి రోజు జాగింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. జాగింగ్ చేయ‌డం వ‌ల్ల ముఖ్యంగా అదనంగా ఉన్న కేలరీలను తగ్గించటానికి సహాయపడుతుంది. రోజులో ఎంతోకొంత స‌మ‌యం కేటాయించి జాగింగ్ చేయ‌డం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రతి రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా జాగింగ్ చేయడం వల్ల జ్ఝాపకశక్తిని పెంచడంతో పాటు మెద‌డును ప్రశాంతంగా  ఉంచుతుంది. మ‌రియు ఎంత కష్టమైన పనైనా సులభంగా అధిగమించి శక్తిని పొంద‌గ‌ల‌ము. అలాగే జాగింగ్ చేస్తే రకం-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించటానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. జాగింగ్ చేయడం వల్ల కండాలమీద, ఎముకలమీద ఒత్తిడి ఎక్కువై ఎముకల సాంద్రత పెరుగుతుంది.

జాగింగ్ చేయ‌డం వ‌ల్ల డిప్రెషన్, ఆందోళన స్థాయిలు తక్కువగా ఉంచుతుంది. ఒత్తిడిని ఓర్చుకునే శక్తిని పెంచుతుంది.  జాగింగ్ చేయ‌డం వ‌ల్ల ఎటువంటి వ్యాధులనైనా ఎదుర్కొనే శక్తిని పొంద‌వ‌చ్చు. జాగింగ్ రక్త ప్రసరణ పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటు నిర్వహణ, వివిధ హృదయ సంబంధిత రోగాలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు జాగింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు చేకూర్చుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news