12వ వసంతంలోకి వైసీపీ..నేడు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆవిర్భావ వేడుక‌లు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నేడు 12 వ వసంతం లోకి అడుగు పెట్టింది. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాల స్ఫూర్తి తో పురుడు పోసుకున్న వైసీపీ పార్టీ నేడు 11 ఏళ్లు పూర్తి చేసుకుని.. 12 వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం పలు సంఘటనల నేపథ్యంలో.. ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా మార్చి 12 వ తేదీ 2011 న వైసీపీ పార్టీ ఆవిర్భావించింది.

వైసీపీ పార్టీ స్థాపించడానికి అప్పటి పరిస్థితులు దారి తీశాయి. 2009 సెప్టెంబర్‌ 2 వ తేదీన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించారు. ఆ తరువాత జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని దాదాపుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

కానీ అధిష్టానం జగన్‌ మోహన్‌ రెడ్డిని కాదని రోశయ్యకు పదవిని కట్టబెట్టింది. రోశయ్యకు పదవిని కట్టబెట్టిన తరువాత ఏపీలో మార్పులు జరిగాయి. అదే తరుణంలో… జగన్‌ మోహన్‌ రెడ్డి.. వైసీపీ పార్టీని ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్లు ప్రతి పక్షంలో ఉండి.. 2019 లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. కాగా.. వైసీపీ ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపు నిచ్చింది పార్టీ అధిష్టానం.

Read more RELATED
Recommended to you

Latest news