బాబు గడ్డ..జగన్ అడ్డా..వైసీపీకే మళ్ళీ లీడ్.!

-

ఎక్కడైనా రాజకీయాల్లో పార్టీల అధినేతలు..తమ సొంత జిల్లాల్లో సత్తా చాటుతారు. ఆ జిల్లాలో తమ పార్టీని గెలిపించుకుంటారు. ఇప్పుడు జగన్..తన సొంత జీల జిల్లా కడపలో ఏ విధంగా సత్తా చాటుతారో చెప్పాల్సిన పని లేదు. 2014లో 10కి 9 సీట్లు, 2019లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే కడపలో జగన్ హవా ఏంటో చెప్పాల్సిన పని లేదు. కానీ అలా చంద్రబాబు సత్తా చాటలేరు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు..కానీ ఇక్కడ టి‌డి‌పి కాదు వైసీపీ సత్తా చాటుతుంది.

గత రెండు ఎన్నికల్లో అదే పరిస్తితి..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీకే ఆధిక్యం దక్కేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 13, టి‌డి‌పి ఒక సీటు గెలుచుకుంది. అది కూడా చంద్రబాబు కుప్పంలో గెలిచారు. ఇప్పుడు కుప్పంలో సత్తా చాటాలని వైసీపీ చూస్తుంది. అయితే ఎంత ప్రయత్నించిన సొంత జిల్లాలో బాబు సత్తా చాటలేకపోతున్నారు. ఇక్కడ టి‌డి‌పి బలపడటంలేదు. ఇప్పటికీ వైసీపీ లీడ్ లోనే ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఆధిక్యం సాధించేలా ఉంది.

ప్రస్తుతం అక్కడ వైసీపీ పక్కా గెలిచే సీట్లు..పుంగనూరు, తంబళ్ళపల్లె, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, సత్యవేడు, చంద్రగిరి సీట్లు. ఇక టి‌డి‌పికి అనుకూలం నగరి, కుప్పం, పలమనేరు, పీలేరు సీట్లే. ఇక చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె సీట్లలో వైసీపీకే ఆధిక్యం ఉంది..కానీ టి‌డి‌పి కాస్త కష్టపడుతుంది. అయినా సరే చిత్తూరులో వైసీపీ ఖచ్చితంగా 8 పైనే సీట్లు గెలుచుకునేలా ఉంది. మొత్తానికి బాబు సొంత గడ్డ…జగన్ అడ్డాగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news