ఆంధ్రప్రదేశ్ లో హైకోర్ట్ ఇస్తున్న తీర్పుపై ఇప్పుడు అధికార పార్టీ కాస్త అసహనంగానే ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, తాజాగా రాజధాని వ్యవహారంలో హైకోర్ట్ నిర్ణయం అన్నీ కూడా అధికార పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశాలు. ఈ నేపధ్యంలో తాజాగా మంత్రి ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పశ్చిమ గోదావరికి చెందిన మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.
ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కోర్టుల్లో వేసి కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. న్యాయస్థానాలను మభ్యపెట్టడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం మీకున్న అలవాటని ఆయన చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసారు. గతంలో మంత్రులు ఇదే విధంగా వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఇప్పటికే హైకోర్ట్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.