పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే.. అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లో మెరుపు తీగనే గుర్తు చేస్తున్నారు జనాలు. కొన్నాళ్లు సినిమాల్లో కనిపించకుండా గ్యాప్ తీసుకుంటే.. కొన్నాళ్లు రాజకీయాల్లో కనిపించకుండా పోతుంటారని అంటున్నారు. ఇలా కొందరు పవన్‌ను విమర్శిస్తుంటే కొందరు మద్దతు పలుకుతున్నారు. ఇక తన కుటుంబం కోసం, పార్టీ ఆర్థిక పుష్టి కోసం తాను సినిమాలు చేయడం తప్పనిసరి అని జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు.
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్లాస్ బద్దలైపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ సినిమాలైనా చేసుకోవాలి, లేదంటే రాజకీయాలైనా చేసుకోవాలని విమర్శించారు. అంతేకాని సినిమాలకి మధ్యలో రాజకీయాలు చేయడం మానుకోవాలి అంటూ ఘాటు సెటైర్లు వేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్నది మూడు, లేనివి కూడా మూడే నని, అది నేనెప్పుడో చెప్పాను అంటూ పవన్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. పవన్ కి సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఈ మూడు లేవని అన్నారు. ఆయనకి ఉన్న మూడు ఏంటో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని మూడు పెళ్లిళ్ల గురించి వ్యక్తిగత విమర్శలు చేసారు వైసీపీ ఎమ్మెల్యే.