టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ఆర్ అనే భారీ హిస్టారికల్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2021, జనవరి 8న రిలీజ్ కానుంది. ఇక ఎక్కువగా తన సినిమాల గురించి మాత్రమే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రస్తావించే రాజమౌళి,
నేడు కాసేపటి క్రితం హఠాత్తుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కొంత వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించడం టాలీవుడ్ వర్గాల్లో కొంత సంచలనంగా మారింది. కంగ్రాట్యులేషన్స్ రాము తాతయ్య గారు, మీ మనవరాలు ఖచ్చితంగా మీకు కళ్లెం వేసి మిమ్మల్ని అదుపులో పెడుతుందని భావిస్తున్నాను, రాము తాతయ్య, రాము నాన్న, అంటూ విపరీతంగా నవ్వుతున్న ఎమోజిలు పోస్ట్ చేసారు రాజమౌళి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం,
వర్మకు నేడు మనవరాలు పుట్టిందని, అందువల్లనే ఆయనకు రాజమౌళి ఒకింత డిఫరెంట్ గా ఈ విధంగా విషెస్ తెలిపారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విధమైన వ్యంగ్యాస్త్రాలు ఎవరిపైనా కూడా సంధించే అలవాటు లేని సౌమ్యుడిగా పేరున్న రాజమౌళి, ఒక్కసారిగా ఇలా వర్మపై ట్వీట్స్ వేయడం ఎంతో ఆసక్తికరంగా మారడం తో పాటు ఆయన చేసిన ట్వీట్స్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి…..!!
Congratulations Ramu thaatayya garu…?????❤️❤️
Wishing your granddaughter will be the person who will finally rein you in… btw what do you prefer
Ramu tata
Ramu Nanna or
Grandpa Ramu…@RGVzoomin ???— rajamouli ss (@ssrajamouli) February 10, 2020