ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. యూపీలోని రక్షణ కారిడార్‌లో రూపొందించిన ఫిరంగులు గుర్జించడం మొదలుపెడితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ ఔట్ అవుతుందని అన్నారు. యూపీలో రక్షణ కారిడార్ అందుబాటులోకి రానుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్ రీజియన్‌లోని బాందాలో నిర్వహించిన కలింజార్ మహోత్సవ ప్రారంభ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
బుందేల్‌ఖండ్ రీజియన్‌ను అభివృద్ధి చేసేందుకు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించినట్లు యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. దీంతో చిత్రకూట్-దిల్లీ మధ్య ప్రయాణ సమయం 5.30 గంటలకు తగ్గిందని అన్నారు. చిత్రకూట్‌లో త్వరలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో రక్షణ కారిడార్ నిర్మాణం జరుగుతోందన్న ఆయన.. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం ప్రారంభిస్తే.. పాక్ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని అన్నారు. భారత్ ఏరోస్పేస్, రక్షణ విభాగాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (యూపీడీఐసీ)ను ఏర్పాటు చేస్తున్నారు.