మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వ్యాపారాలను చెయ్యడానికి ఇష్టపడుతున్నారు దాని ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. మీరు కూడా అదే దారిలో వెళ్లాలి అనుకుంటున్నారా అయితే ఇది బెస్ట్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
వేప చెట్లను పెంచి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు దీనికోసం మీరు పొలాల్లో ఇతర పంటల మధ్య వేప మొక్కలు నాటొచ్చు. ఇలా చేయడం వల్ల డబ్బులు మాత్రమే కాదు సారవంతమైన నేల కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే మీరు వేప చెట్టు లని పెంచేందుకు నిర్ణయించుకుంటే మలబార్ వేప నాటండి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో చాలా మంది రైతులు దీనిని పండిస్తున్నారు తద్వారా మంచి లాభాలను పొందుతున్నారు. అయితే ఈ వేప చెట్టు మామూలు వేపలగా ఉండదు మామూలు వేపచెట్టు కాస్త భిన్నంగా ఉంటుంది ఈ చెట్లను నాటడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే పురుగుల బెడద ఉండదు.
నాలుగు ఎకరాల పొలం ఉంటే 5000 మలబార్ వేప మొక్కలు నాటచ్చు. చెట్ల నుండి లాభాలు రావాలంటే ఎనిమిదేళ్లు పడుతుంది. ఒక చెట్టు నుండి ఆరు వేల నుండి ఏడు వేల వరకు సంపాదించవచ్చు ఈ లెక్కన చక్కగా యాభై లక్షల వరకు వస్తాయి ఐదువేల చెట్లను కనుక నాటారంటే.