డేటా దొంగ చంద్రబాబు డేరా బాబా కన్నా డేంజర్ అన్నారు మంత్రి ఆర్కే రోజా. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ప్రజా సాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్టపన్నాగం పన్నారని ఆరోపించారు. 30 లక్షల మంది డేటాను చోరీ చేశారని అన్నారు. డేటా చౌర్యం పై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాం అన్నారు.
డేటా చోరీ పై హౌసింగ్ కమిటీ ఇచ్చిన మద్యంతర నివేదికతో టిడిపి నేతల గుండెలు జారిపోయాయన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్ లని ట్యాప్ చేయించారని విమర్శించారు. హౌస్ కమిటీ నివేదికపై స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే గనుక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఫోన్ టాపింగ్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని విషయాన్ని గతంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ధ్రువీకరించిన విషయాన్ని రోజా గుర్తుు చేశారు. ఫోన్ టాపింగ్ ద్వారా ప్రతిపక్ష సభ్యులను బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంగా లొంగదీసుకునే ప్రయత్నం కూడా జరిగిందన్నారు.