ఈ మేకప్ మిస్టేక్స్ తో వయసు పైబడిన వారిలా కనిపిస్తారట

-

మేకప్ వేసుకోని అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. కనీసం..ఫౌండేషన్ వేసుకుని, లిపిస్టిక్ , కాజల్ పెట్టుకునే వాళ్లు అయితే చాలామంది ఉంటారు. ఇది మేకప్ లో భాగం కాదు.. జస్ట్ రెడీ అవుతున్నాం అంతే అని వారి మాట. సరే ఏదై కానీ.. మేకప్ వేసుకోవడం వల్ల మనం ఎంత అందంగా కనిపిస్తామో.. అది సరిగ్గా వేయకపోతే.. అంత చెండాలంగా తయారవుతాయి. ఉన్న అందాన్ని కూడా చెడగొట్టేస్తుంది. మేకప్ వేయడంలో మిస్టెక్స్ చేశారంటే.. అది మీ ఏజ్ ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. జనరల్ గా టీనేజ్ వాళ్లు మేకప్ మిస్టెక్స్ చేస్తే.. పర్లేదు..నడుస్తుంది. ఇక ఒక మిడిల్ ఏజ్ లో ఉన్నవాళ్లు.. ఇలాంటి తప్పులు చేస్తే.. పాపం వారి ఏజ్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. కొండనాలుకకు మందేస్తే. ఉన్న నాలుకు ఊడినట్లు అవుతుంది. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దామా..!
ఎక్కువ ఫౌండేషన్ వాడితే తక్కువ సమయంలో చర్మం పాడవుతుంది. బేస్ బాగా కలపడం కూడా ముఖ్యం.
మీ చర్మానికి సరిపోని కొన్ని షేడ్స్ లిప్‌స్టిక్‌లు ఉంటాయి.. దానివల్ల మీరు పెద్దవారిగా కనిపించవచ్చు. ఉదాహరణకు పసుపు, ఎరుపు, ఊదా రంగుల లిప్ స్టిక్ వేసుకుంటే వయసు పైబడిన వారిలా కనిపిస్తారు.
లిప్‌స్టిక్‌లాగా, కంటికి తప్పుగా మేకప్ చేయడం వల్ల మీరు పెద్దవారిగా కనిపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో తప్పు ఐ షాడో షేడ్‌ని ఎంచుకోవడం మానుకోండి. కొన్నిసార్లు స్మోకీ ఐ మేకప్ కూడా మిమ్మల్ని పెద్దవాళ్లలా చేస్తుంది.
మీ చర్మం చాలా పొడిగా ఉంటే ,మీరు మేకప్ వేయాలనుకుంటే, చర్మం చాలా వేగంగా మేకప్‌ను గ్రహిస్తుంది. మీ చర్మాన్ని ఎలాంటి మేకప్ వస్తువులు నప్పుతాయో మీరు ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. వీలైతే, రాత్రిపూట మాత్రమే వాడే డీప్ క్రీమ్ ఉపయోగించండి.
 లిప్‌స్టిక్‌ ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది క్వాలిటీదై ఉండాలి. మనకు సెట్ అవ్వాలి. లేదంటే.. ఫస్ట్ ఇంప్రషన్ పోతుంది. ఎదుటివారు మనల్ని చూసేప్పడు.. లిపిస్ట్కి ఆడ్ గా ఉన్నా.. అది చీప్ క్వాలిటీదై ఉండి.. ఫేడ్ అయిపోయినా. వాళ్లకు ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి.. లిపిస్టిక్ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైనది వాడితే.. ఇది మీ అందాన్ని మరింత పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news