‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్‌పై టికెట్ల ధరల ప్రభావం.. ఈ ప్రాంతాల్లో థియేటర్లు ఖాళీ..

-

దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసి అభిమానులు, సినీ ప్రేక్షకులు సంతోషపడుతున్నారు. సినిమా వేరే లెవల్‌లో తీసిన రాజమౌళికి, అత్యద్భుతంగా పర్ఫార్మ్ చేసిన హీరోలు తారక్, చెర్రీలకు థాంక్స్ చెప్తున్నారు. ఇకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కోసం చాలా మంది ట్రై చేశారు. కానీ, దొరకకపోవడంతో తర్వాత టికెట్లు దొరకినపుడు చూద్దామనుకున్నారు. అయితే, ఈ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. తెలంగాణ సర్కారు టికెట్ల ధరల పెంపునకు అనుమతినిచ్చిన నేపథ్యంలో థియేటర్స్ యాజమాన్యాలు ధరలు పెంచాయి. దాంతో ఆ ప్రభావం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపైన కూడా పడింది.

జనరల్‌గా ‘ఆర్ఆర్ఆర్’ పెద్ద సినిమా కాబట్టి టికెట్స్ ప్రైసెస్ హైక్ చేసినప్పటికీ అభిమానులు, సినీ ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వస్తారని అందరూ అనుకున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో అలానే జరుగుతున్నది. కానీ, ఈ ప్రాంతాల్లో మాత్రం థియేటర్లలో జనాలే లేరు. ఖాళీ సీట్లు కనబడటం మనం చూడొచ్చు కూడా.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమైంది. కాగా, అందులో ప్రేక్షకులు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఆసిఫాబాద్ జిల్లాలోని థియేటర్ లోనూ ఈ పరిస్థితే ఉంది. కొమురం భీం నేపథ్యం ఉన్న సినిమాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతంలోనూ ప్రేక్షకులు రాలేదు.

ఈ క్రమంలోనే టికెట్ల ధరల పెంపు అంశం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపే పరిస్థితులున్నాయని ఈ సందర్భంగా సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే, తెలంగాణతో పోల్చితే ఏపీలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరలు చాలా తగ్గించేశాయి. అయితే, పెద్ద చిత్రమైన ‘ఆర్ఆర్ఆర్’కు మాత్రం టికెట్ల ధరలు పెంచింది. ఇందుకు సంబంధించి ఇటీవల ఏపీ సర్కారు జీఓ కూడా ఇచ్చింది. మొత్తంగా టికెట్ల ధరల పెంపు సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం చూపబోతుందనే చర్చ కూడా జరుగుతున్నది.

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news