బేకింగ్ సోడాతో శుభ్రం చేయకూడని వస్తువులేంటో తెలుసా..?

-

ఏదైనా శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడడం మామూలే. ఐతే అన్ని వస్తువులని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడరాదు. బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల కొన్ని వస్తువులు వాటి పూర్వ వైభవాన్ని కోల్పోతాయి. అలాంటి వస్తువులేంటో ఇక్కడ చూద్దాం.

అద్దాలు..

అద్దాలని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని అస్సలు అనుకోవద్దు. దీనివల్ల అద్దంలో ఉండే పదార్థాలతో రసాయన చర్య జరిపి అద్దం పగిలిపోయే అవకాశం ఉంటుంది.

అల్యూమినియం

అల్యూమినియం వస్తువులని బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల వాటి ఉపరితలాలు గోధుమ రంగులోకి మారిపోతాయి.

మార్బల్

మార్బల్ ని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని కొందరు చెబుతుంటారు. కానీ మార్బల్ తయారీదారులు మాత్రం అలా చేయకూడదని చెబుతుంటారు. బేకింగ్ సోడా కారణంగా మార్బల్ పై మరకలు ఏర్పడడంతో పాటు మార్బల్ పై ఉన్న పొర తొలగిపోతుంది.

చెక్క వస్తువులు

చెక్క వస్తువులని కూడా బేకింగ్ సోడాతో శుభ్రం చేయకూడదు.

వెండి వస్తువులు

వెండితో బేకింగ్ సోడా చర్య జరిపి దానిపై ఉండే మెరిసే గుణాన్ని తీసివేస్తాయి. దానివల్ల వెండి రంగు మారే అవకాశం ఉంది.

చర్మం

బేకింగ్ సోడాలో బేసిక్ పీహెచ్ వాల్యూ ఉంటుంది. అది మీ చర్మంపై చేరితే పగుళ్ళు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

జుట్టు

చర్మం మాదిరిగానే జుట్టు కూడా పొడిబారిపోయి విఛ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుంది.

బంగారు ఆభరణాలు

వెండి వలె బంగారు ఆభరణాలు కూడా వాటి మెరిసే గుణాన్ని కోల్పోయే అవకాశం ఉంది. బేకింగ్ సోడా మంచి శుభ్రపరిచే వస్తువు అయినప్పటికీ అన్ని వస్తువులని శుభ్రపరిచేందుకు పనిచేయదని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news