మ‌ల్టీ ట్యాలెంటెడ్ ఎన్టీఆర్‌.. మ‌రోసారి హోస్ట్ గా ఆక‌ట్టుకుంటాడా!

ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంరికీ తెలిసిందే. అతి త‌క్కువ టైమ్ లోనే ఏ హీరోకు సాధ్యం కాని మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇప్ప‌టికీ ఆయ‌న తీసే సినిమాల‌ను ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తీస్తారు. ఎన్టీఆర్ మ‌ల్టీ ట్యాలెంటెడ్ హీరో. డ్యాన్స్, న‌ట‌న, యాంక‌రింగ్ ఇలా అన్ని కోణాల్లో త‌న మార్కును చూపించాడు. ‌


ఇప్ప‌టికే బిగ్‌బాస్ అనే ప్రోగ్రామ్ ను తానే ముందుగా యాంక‌ర్ గా చేసి మంచి క్రేజ్ తీసుకొచ్చాడు. ఆ ప్రోగ్రామ్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. తెలుగు ప్రేక్ష‌కులు ఈ ప్రోగ్రామ్ కు అంత‌గా క‌నెక్ట్ కావానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయ‌డమే కార‌ణం. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఎన్టీఆర్ ఆ ప్రోగ్రామ్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత పెద్ద‌గా ప్రోగ్రామ్ చేయ‌లేదు యంగ్ టైగ‌ర్‌.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఓ పెద్ద ప్రోగ్రామ్ తో మ‌న ముందుకు రాబోతున్నాడు. ప్ర‌స్తుతం భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో న‌టిస్తున్నాడు ఎన్టీఆర్‌. భీమ్ పాత్ర‌లో ఎంత బాగా ఒదిగిపోయాడో టీజ‌ర్ లో చూశాం. ఈ మూవీ త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొరటాల శివతో మరో భారీ సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ఇవి లైన్ లో ఉండగానే తారక్ మళ్లీ బుల్లితెరపై మెరవబోతున్నాడు. ఈసారి “ఎవరు మీలో కోటీశ్వరులు”తో ప్రోగ్రామ్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఎన్టీఆర్ లుక్ ప్రోమో కూడా రిలీజై ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ షోలో పాల్గొనే వారి కోసం ఆడిషన్స్ తిరుప‌తిలో జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక జ‌రిగాకే ఈ ప్రోగ్రామ్ వ‌చ్చే నెల‌లో మొద‌లు పెడ‌తార‌ని స‌మాచారం. మ‌రి ఇది ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.