మహిళా దినోత్సవం నాడు మీకు నచ్చిన మహిళలకి బహుమతులు ఇవ్వాలని అనుకుంటున్నారా..? అయితే ఏ గిఫ్ట్స్ ని ఇవ్వాలో మీకు తోచడం లేదా అయితే ఈ ఐడియాస్ ను చూడండి. వీటిని కనుక మీరు బహుమతిగా ఇస్తే తప్పక మహిళలు ఇష్టపడతారు. పైగా అంత ఖరీదైనవి కూడా కాదు. బడ్జెట్లోనే వీటిని మనం కొనుగోలు చేయవచ్చు. అయితే మరి మహిళల కి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే మంచిది అనేది ఇప్పుడు చూద్దాం.
జ్యువెలరీ:
సాధారణంగా ఈ మధ్య ఫ్యాషన్ గా అందరూ ఉంటున్నారు. పైగా ట్రెండ్ కి తగ్గట్టు రెడీ అవుతున్నారు. మహిళలకి ఎన్నో ఆర్టిఫిషియల్ జువెలరీ ఉంటాయి. ఇయర్ రింగ్స్, పెండెంట్స్, నెక్లెస్ ఇలాంటివి. మీరు ఇటువంటి వాటిని కొనుగోలు చేసి వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వొచ్చు. ఇవి వాళ్లకి నచ్చుతాయి. పైగా ఉపయోగిస్తారు కూడా.
స్పా కూపన్స్:
ఎక్కువ మంది మహిళలు బ్యూటీపార్లర్ వంటి వాటికి వెళుతూ ఉంటారు. మీరు ఈ గిఫ్ట్ కూపన్స్ ని కూడా బహుమతి కింద ఇవ్వచ్చు ఒకవేళ అలా కాదు అంటే మీరు స్పా బాస్కెట్ ని గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఈ గిఫ్ట్ కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది.
మేకప్ కిట్ లేదా మేకప్ బాక్స్:
మీరు ఎవరికైనా ఏమైనా బహుమతి ఇవ్వాలనుకుంటే వీటిని కూడా మీరు ఇవ్వొచ్చు. మేకప్ ప్రోడక్ట్స్ ని కాకపోతే మేకప్ ఆర్గనైజర్ లాంటివి ఇవ్వచ్చు.
డెజర్ట్స్:
వాళ్లకు టేస్ట్ కి తగ్గట్టు చాక్లెట్, కేక్స్, పేస్ట్రీస్, డో నట్స్ లేదంటే మీరు వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ ని మీరు చేసి ఇవ్వొచ్చు.
పర్ఫ్యూమ్స్:
పర్ఫ్యూమ్స్ ని కూడా మీరు సెలెక్ట్ చేస్తే గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు. ఇలా మహిళలకు ఈ విధంగా మహిళల దినోత్సవం నాడు ఇస్తే తప్పకుండా వాళ్ళు ఇష్టపడతారు.