దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ ఆర్యా రాజేంద్రన్ కేరళ అసెంబ్లీలో పిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ దేవ్‌ను వివాహమాడారు. తిరువనంతపురంలోని ఏకేజీ సెంట్రల్ హాల్లో ఆదివారం జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్వీ గోవిందన్, మంత్రులు శివన్కుట్టి, మహ్మద్ రియాజ్, ఆంటోని రాజు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇరువురు దంపతులు పూల దండలు మార్చుకున్నారు.
తమ పెళ్లికి వచ్చే అతిథులు బహుమతులు తీసుకురావొద్దని గతంలోనే చెప్పారు. తమకు గిఫ్ట్‌లు ఇచ్చే బదులు అనాథ ఆశ్రమాలకు సాయం చేయాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బులు ఇవ్వాలని కోరారు. బలుస్సెరి అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ముందు నుంచీ మంచి స్నేహితులు. బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి వివాహ ప్రతిపాదనకు ఇరు కుటుంబాలు అంగీకరించడం వల్ల పెళ్లి పీటలెక్కారు.