హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు పెట్టడాన్ని ఖండించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

-

హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు జాతీయ యూత్ కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ లో జరిగే ఇండియా – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కి టికెట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు జాతీయ కాంగ్రెస్ నాయకులు అనిల్. పోలీసులు బందోబస్తు కల్పించాల్సింది పోయి హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కేటిఆర్, మంత్రి శ్రీనివాస్ లు హెచ్సిఏ పై ప్రెషర్స్ చేశారని ఆరోపించారు. ఈ ప్రెషర్స్ వల్లే టికెట్స్ మొత్తం బ్లాక్ లిస్ట్ అయ్యాయని అన్నారు. గాయపడ్డ బాధితులకు చికిత్స కోసం ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని మండిపడ్డారు. మేము స్వయంగా బాధితుల దగ్గరకు వెళ్లి మాట్లాడామన్నారు అనిల్. టికెట్ల గందరగోళం బాధ్యత ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు.

గాయపడ్డ బాధితులకు చికిత్స అందించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వం దేనన్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మేము ఏ కార్యక్రమం చేపట్టిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారని..మా మీద దృష్టి పెట్టిన పోలీసులు మ్యాచ్ పై ఎందుకు ఫోకస్ చేయలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news