టిక్‌టాక్‌ పోయింది.. యూట్యూబ్‌ షార్ట్స్‌ వచ్చింది..!

-

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ను భారత్ లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. భారత్ బాటలోనే నడిచిన అమెరికా సహా మరికొన్ని దేశాలు కూడా ఈ యాప్ ను బ్యాన్ చేశాయి. దీనికి ప్రత్యాన్మాయ యాప్ కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. దీంతో చాలా దేశాలు దీనికి ప్రత్యాన్మాయ యాప్ ను తయారుచేసే పనిలో పడ్డాయి. అయితే తాజాగా.. యూట్యూబ్ దీనికి ప్రత్యాన్మాయాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. షార్ట్‌ వీడియో ఫార్మాట్‌లో ‘షార్ట్స్‌’ పేరిట భారత్‌లో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనుంది.

 

మొబైల్ ఫోన్ల ద్వారా చిన్న వీడియోలు పోస్ట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూట్యూబ్ తెలిపింది. 15 సెకన్లు ఉండే క్రియేటివ్ వీడియోల ద్వారా యూజర్లు తమను తాము కొత్తగా పరిచయం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని యూట్యూబ్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news