దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆనందంగా తమ కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా కలిసి టపాసులు పేలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం బాణాసంచా కాల్చడంలోనూ వినూత్నతను చూపించారు.
అందరిలా సాధారణంగా టపాసులు కాలిస్తే బోర్ కొడుతుందని భావించాడు రాజస్థాన్ అల్వార్ కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ. అందుకే కాస్త వెరైటీగా ఆలోచించాడు. ఓ కారును సెలెక్ట్ చేసుకున్నాడు.. ఆ కారును లక్ష టపాసులతో అలంకరించాడు. కారు ముందున్న గ్లాస్ మినహా కారు చుట్టూ లక్ష టపాసులు అమర్చాడు.
ఆ తర్వాత వీడియో రికార్డర్ ఆన్ చేసి కౌంట్ డౌన్ షురూ చేశాడు. 1, 2, 3 అంటూ కారుపై ఉన్న టపాసులు అంటించాడు. కొద్దిసేపు ఆ కారు చుట్టూ పరిసరాలు గట్టిగట్టి శబ్ధాలతో మార్మోగిపోయాయి. బాంబులన్నీ పేలిన తర్వాత కారు రంగు మొత్తం మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి.. టపాసుల ధాటికి కారు గ్లాస్ మెత్తబడిపోయి పగిలిపోయింది.
లక్ష బాంబులు పేలినా కారు ఇంజిన్ మాత్రం పనిచేయడం విశేషం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ తన దోస్తులతో ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Crazy People! 🤷♂️#Diwali #Deepavali2022 pic.twitter.com/FeCxK3To6a
— Hi Hyderabad (@HiHyderabad) October 25, 2022