ఎంత బాగా ఆయన పనిచేశారో ఒక్కసారి తలుచుకుంటే ఒళ్లు పులకించి పోవాలి.గుండె పరవశించిపోవాలి. మనసు ఆనందంతో నిండిపోవాలి. అలాంటి అధికారిని పాపం జగన్ సర్ తప్పించి తన పంతం నెగ్గించుకుని, గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయనకు ఇక తిరుగులేదుర. ఇక కాదు ఇకపై తిరుగులేదు అని విన్నవించుకుంటూ దీనిపై కోర్టుకు సవాంగ్ వెళ్ల రాదని,అదేవిధంగా ఇతర అధికారులకు సీనియార్టీ ఉన్నా కూడా వారిని వద్దని రాజేంద్ర నాథ్ అనే అధికారిని తీసుకోవడం పై కోర్టుకు ఇంకెవ్వరూ వెళ్లరాదని కోరుకుందాం. జగనన్న నిర్ణయాలు అన్నీ ప్రజోపయోగం కోసమే అని నిర్థారించడం ఒక్కటే మన వంతు..మిగతాది పైవాడి లీల.
నిన్నటి వేళ ఉన్నపళాన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను తప్పించారు జగన్. అంతేకాదు ఆయన స్థానంలో సొంత సామాజికవర్గంకు చెందిన డీజీపీ స్థానంలో నియమించుకున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి రాకతో పరిణామాలు ఎలా ఉండనున్నాయో అన్నది ఓ ఆసక్తిదాయక పరిణామం. అయినా చలో విజయవాడ కార్యక్రమం ఫెయిల్ అవ్వడంలో డీజీపీతో సహా ఇంటెలిజెన్స్ డీజీ పాత్ర కూడా ఉంది.
కానీ ఈ పాపానికి డీజీపీని మాత్రమే బాధ్యుడ్ని చేసి, నిఘా సంస్థల అధిపతి అయిన (డీజీఅయిన రాజేంద్రనాథ్) ను మాత్రం తీసుకువచ్చి నెత్తిన పెట్టుకోవడం అన్నది ఇప్పుడిక ఓ పెద్ద చర్చకు తావిస్తోంది.అయినా జగన్ ఏమనుకున్నా చేయగలరు.. ఎంతంటే అంత చేయగలరు.. ఎంత అనుకున్నారో అంతకుమించి కూడా చేయగలరు.అందుకే డీజీపీని తప్పించారు.
ఇక ప్రజా ఉద్యమాల అణిచివేతలోనూ,అదేవిధంగా నక్సల్ చర్యలను నియంత్రించడంలోనూ, ఇంకా కొన్ని అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడంలోనూ చక్కబెట్టడంలోనూ ఆయన మంచి పేరే తెచ్చుకున్నారు.ముఖ్యంగా ఆయన ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడంలో దిట్ట.అచ్చెన్న కానీ పట్టాభి కానీ ఇలా ఎవ్వరైనా సరే ఆయన దగ్గరుండి అరెస్టు చేయించగలరు.
వారిని నియంత్రించడంలోనూ ఆయనే టాప్. అర్ధరాత్రి అరెస్టులు చేయించడంలో ఆయనే టాప్. అదేవిధంగా అశోక్ బాబు అనే ఎమ్మెల్సీని, చింతమనేనిని, కొల్లు రవీంద్రను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! అందరినీ అరెస్టు చేయించడంలో ఆయన టాప్. అయినా కూడా పాపం టీడీపీ నాయకుల విషయమై వివక్షతో కూడిన ఉద్యోగం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఆయనను డీజీపీ విధులను తప్పించి పెద్ద నేరమే చేసింది.