వైసీపీలో విభేదాలపై జగన్ ఫోకస్..నేతలతో విడివిడిగా చర్చలు.

-

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో ఇటీవలే కాలంలో గ్రూప్ రాజకీయలు ఎక్కువయ్యాయి..వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీలో అక్కడక్కడా వర్గ విభేదాలు పొడచూపాయి..జిల్లాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీల మధ్య సయోధ్య ఉండటం లేదు..పార్టీలోకి ఇతర పార్టీలను వచ్చిన వారితో మొదటినుంచి పార్టీలో ఉన్న నేతల మధ్య విబేధాలు బహిర్గతం అవుతున్నాయి..పార్టీలో ఉన్న అసంతృప్తులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు..ప్రతి పక్షాలకు అవకాశాలు ఇవ్వకుండా అంతర్గ విభేదాలను పరిష్కరించే పనిలో పడ్డారు..జిల్లాల్లో పార్టీ నేతలల్లొ ఉన్న అంతర్గత లుకలుకలను సరిదిద్దే పని ముందేసుకున్నారు పార్టీ అధ్యక్షుడు,సీఎం జగన్.

ఇప్పటికే కాకినాడ నేతలతో జగన్‌ చర్చించారు..వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి, పిల్లి సుభాష్‌కు సీఎం జగన్ క్లాస్ తీసుకోవడంతో తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు సమసిపోయినట్లు తెలుస్తుంది..వారి మధ్య వచ్చిన పొలిటికల్ గ్యాస్‌ను తొలగించే ప్రయత్నం చేశారు,ఇద్దరు కలిసి పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం..దీంతో ఇద్దరు నేతల మధ్య విబేదాలు సమసిపోయినట్టేనా? కలిసి పనిచేయాలన్న CM జగన్‌ మాటకు కట్టుబడతారా? అందుకే ద్వారంపూడి ఇంటికి పిల్లి వెళ్లారా?.అన్న వార్త ఇప్పుడు తూ.గో జిల్లా నేతల్లో చర్చ జరుగుతుంది.

ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ సుభాష్ చంద్రబోస్ వెళ్లడంతో ఈ వ్యవహారం చల్లబడింది. తొలిసారి తారా స్థాయిలో బడా నేతలు దూషించుకుని, దాడులకు సిద్ధమైన ఘటన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందటి జిల్లా డీఆర్సీ సమావేశంలో.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అదే పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఘర్షణ పడటం, బూతులు తిట్టుకోవడం సంచలనం రేపింది..డీఆర్సీ సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న గొడవకు సంబంధించి ఎంపీ బోస్ గతంలోనే వివరణ ఇచ్చారు. తాను మాట్లాడింది ద్వారంపూడి అవినీతిపై కాదని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాల గురించని వివరించారు.

ఈ వ్యవహారంపై పార్టీ అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని, క్లాస్ పీకారు. బహిరంగ వేదికలపై పరస్పరం విమర్శలు చేసుకోవద్దని సీఎం హితవు పలికారు. దీంతో సెట్ రైట్ అయిన ఇరువురు నేతలు ఇప్పుడు జిల్లా వేదికగా ఒకే చోటకు చేరి ఐక్యతను ప్రదర్శించారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి ఆహ్వానించారు. బోస్ రాగానే ద్వారంపూడి సాదర స్వాగతం పలికారు..మొత్తంమీద సీఎం జగన్ చొరవతో పార్టీలో అంతర్గత కుమ్ములాటకు ఫుల్ స్టాప్ పడినట్టయింది..గత కొంత కాలంగా సంక్షేమ పథకాలు అమలుపై దృష్టి పెట్టిన సీఎం జగన్ పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోలేదు..పార్టీ వ్యవహారాలు చూడాల్సిన నేతలు కూడా పార్టీకి దూరంగా ఉండటం వల్లనే వైసీపీ నేతలో విభేదాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news