రాజకీయాల్లో ప్రత్యర్ధులని చిత్తు చేయాలంటే…స్ట్రాటజీలు చాలా అవసరం. పరిస్తితికి తగ్గట్టుగా వ్యూహాలు పన్నుతూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలి. అయితే రాజకీయాల్లో పాత స్ట్రాటజీలు సైతం బాగానే వర్కౌట్ అవుతాయి…ఇప్పుడు ఏపీలో జగన్ కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పటిలాగానే సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నట్లు కనిపిస్తున్నారు. అసలు వైసీపీ వచ్చిందే సెంటిమెంట్ పైన, అలాగే 2012 ఉపఎన్నికలో వైసీపీ విజయాలు కూడా సెంటిమెంట్ తోనే వచ్చాయి.
ఇక 2019 ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని జగన్…జనాలని కోరారు. జనం సైతం జగన్ ని ఒక్కసారి చూద్దామని అవకాశం ఇచ్చారు. అనుకున్నట్లుగానే జగన్ సీఎం అయ్యారు. అయితే మరోసారి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇదే క్రమంలో తాను ప్రజలకు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పథకాలు అందిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా పథకాలు ఇస్తున్నారు. ఇక పథకాలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయం పక్కన పెడితే…ఏదొరకంగా జగన్…జనాలకు డబ్బులు ఇస్తున్నారు.
ఇలా కష్టపడి తాను డబ్బులు ఇస్తుంటే…దాన్ని కూడా చెడగొట్టడానికి దుష్టచతుష్టయం పనిచేస్తుందని అంటున్నారు…అంటే చంద్రబాబు…టీడీపీకి అనుకూలంగా ఉన్న మూడు మీడియా సంస్థలు తనని టార్గెట్ చేశారని, ఒక్కడిని చేసి ఇబ్బంది పెడుతున్నారని, ప్రజలే తనని కాపాడుకోవాలి అన్నట్లుగా జగన్ చెబుతున్నారు. అంటే ఇక్కడ ఒక్కడినే అని చెబుతూ…సెంటిమెంట్ లేపుతున్నారు. సరే జగన్ అలా కోరడంలో తప్పు లేదు.
కానీ జగన్ ని దెబ్బతీస్తుంది చంద్రబాబు, టీడీపీ మీడియానే కాదు…సొంత పార్టీ వాళ్ళు కూడా అని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయక పార్టీని దెబ్బతీస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో సీఎంగా జగన్ పనితీరు బాగానే ఉన్నా…ఎమ్మెల్యేల పనితీరు మాత్రం సరిగ్గా లేదని తెలుస్తోంది. దాదాపు సగం మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది. ఇక వారే జగన్ ని దెబ్బకొట్టేలా ఉన్నారు…జగన్ స్ట్రాటజీని ఫెయిల్ చేసేలా ఉన్నారు.