బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ కు 2 లక్షలు పెట్టుబడి.. నెలకు రూ.50 వేలు ఆదాయం..వివరాలు..

-

కొత్తగా వ్యాపారాలు చేసి మంచి లాభాలు పొందాలని అనుకుంటారు.కానీ ఎటువంటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అనే విషయం ఎన్నో సందేహాలు రావడం సహజం.. చింతించకండి..మీ కోసం అదిరి పోయే బిజినెస్ ఐడియా ఉంది..వంట నూనె తయారు చేయడాన్ని వ్యాపారంగా మార్చుకుంటే మంచి ఆదాయం సాధించవచ్చు. ఈ వ్యాపారాన్ని గ్రామం లేదా నగరం ఎక్కడైనా ప్రారంభించవచ్చు. గతంలో ఆయిల్ మిల్లులు ప్రారంభించాలనుకుంటే, డబ్బులు ఖర్చయ్యేవి. అధికంగా ప్లేస్ కూడా అవసరం అయ్యేవి. ఇప్పుడు మార్కెట్లోకి పోర్టబుల్ మెషీన్లు రావడంతో తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

 

ఈ ఆధునిక యంత్రాలు పనిచేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చమురు శుద్ధి కర్మాగారం, కొంచెం పెద్ద ఇల్లు మరియు ఆయిల్ తయారు చేయడానికి అవసరమైన పంట అంటే వేరుశనగ, నువ్వులు లాంటి ధాన్యాలు అవసరం. ఆధునిక యంత్రాల సహాయంతో పై ధాన్యాల నూనెను అతి తక్కువ సమయంలో చాలా సులభంగా తీయవచ్చు..ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే మాత్రం ముందుకు ఒక మినీ మెషిన్ కావాలి.

వ్యాపార లాభాలు పెరిగితే పెద్ద యంత్రాలను తర్వాత కొనుగోలు చేయవచ్చు. ఆయిల్ తయారు చేసే మెషిన్ ధర దాదాపు రూ.2 లక్షలుగా ఉంటుంది. ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు లైసెన్స్‌తో సహా కొన్ని ప్రభుత్వ పత్రాలను సేకరించాల్సి ఉంటుంది. మొత్తం మీద మొత్తం 3-4 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. నూనె నాణ్యత బాగుండి, కస్టమర్లను ఆకర్షించగలిగితే వ్యాపారంలో త్వరగా లాభాలను పొందవచ్చు..

ఈ వ్యాపారం నమ్మకం మీద ఉంటుంది.. నూనె మంచిగా ఉంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తారు.వ్యాపారం యొక్క ఆదాయం మరియు లాభం వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. ఆయిల్ ను అవుట్‌లెట్‌గా లేదా దుకాణదారులతో ఒప్పందం ద్వారా విక్రయించవచ్చు. నూనె తయారీలో మిగిలిన వ్యర్థాలను పశువుల దాణాకు విక్రయించుకోవచ్చు. చమురు వ్యాపార ఆదాయం డిమాండ్ తో పాటు.. ముడి పదార్థాల ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. ముడిసరుకు ధర తక్కువగా ఉంటే ఎక్కువ లాభం పొందవచ్చు..మంచిగా వ్యాపారం సాగితే నెలకు 50 వేలకు పై ఆదాయాన్ని పొందవచ్చు… మీకు ఈ బిజినెస్ చేయాలనీ ఉంటే మీరు స్టార్ట్ చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news