వచ్చే నెలలో అదానీ డేటా సెంటర్‌‌ ప్రారంభిస్తాం – సీఎం జగన్‌

-

అదానీ డేటా సెంటర్‌‌ను వచ్చే నెలలో విశాఖలో శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్‌ ప్రకటన చేశారు. అచ్యుతాపురం సెజ్‌లో టైర్ల కంపెనీని ప్రారంభించిన వైయస్‌.జగన్‌..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎగుమతుల్లో 3 ఏళ్ల కాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

cm jagan
cm jagan

9 ఫిషింగ్‌ హార్బర్లుకూడా నిర్మిస్తున్నామని.. ప్రతి 50 కి.మీ. ఒక హార్బర్‌ కాని, ఒక పోర్టునుకాని అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. ఇవి పూర్తి అయితే 10శాతం ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయన్నారు.

3 ఇండిస్ట్రియల్‌ కారిడర్లు ఏపీలో మాత్రమే ఉన్నాయని.. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్‌ – బెంగుళూరు కారిడర్‌లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు. గతంలో మన రాష్ట్రంవైపు చూడని వారు కూడా ఇప్పుడు మన వైపు చూస్తున్నారని.. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెప్తున్నామని స్పష్టం చేశారు. మీరు పరిశ్రమ పెట్టండి.. అన్నిరకాలుగా తోడుగా ఉంటామని.. వారిని చేయిపట్టుకుని నడిపిస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news