అదేంటి చంద్రబాబులో ఏం మార్పు వచ్చింది…ఆయన ఫ్యాన్ తమ్ముళ్ళకు చెక్ పెట్టడం ఏంటి అని డౌట్ రావొచ్చు..అసలు ఫ్యాన్ తమ్ముళ్ళు అనే కాన్సెప్ట్ ఏంటి అని అనుకోవచ్చు. ఫ్యాన్ అంటే వైసీపీ గుర్తు అనే సంగతి తెలిసిందే…అలాగే తెలుగు తమ్ముళ్ళు. ఇంకా ఫ్యాన్ తమ్ముళ్ళు అంటే. వైసీపీకి అనుకూలంగా రాజకీయం చేసే తమ్ముళ్ళు. అదేంటి టీడీపీ వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఎందుకు రాజకీయం చేస్తారని అనుకోవచ్చు. అలా అనుకూలంగా రాజకీయాలు ఎందుకు చేయకూడదు అనేది కూడా ఉంది. అలా చేసేవారికి కోవర్టులు అంటారు. ఈ కోవర్టులు అన్నీ పార్టీల్లో ఉంటారు.
అలాగే ప్రతిపక్ష టీడీపీలో కూడా ఈ కోవర్టులు ఉన్నారు.. పేరుకు టీడీపీలో ఉంటారు గాని, పనిచేసేది వైసీపీకి అనుకూలంగా. ఈ కోవర్టుల వల్ల టీడీపీకి చాలా నష్టం జరుగుతుంది..అలాంటి వారిని పక్కన పెట్టేయాలని బాబు భావిస్తున్నారు. ఇంకా వారిని పార్టీలో ప్రాధాన్యత ఇస్తే చిక్కులు తప్పవని బాబు గ్రహించారు. ఇప్పటికే వారి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉదాహరణకు కుప్పం మున్సిపల్ ఎన్నికలో టీడీపీ ఓటమికి కోవర్టుల పాత్ర చాలా ఉంది.
అసలు కుప్పం మున్సిపాలిటీ టీడీపీ కంచుకోట..అలాంటిది అక్కడ ఉన్న కొందరు టీడీపీ నేతలు…అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేశారు…దీని వల్ల పార్టీకి బాగా నష్టం జరిగింది. అలాగే తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికలో కూడా అదే జరిగింది. టీడీపీలో ఉంటూనే వైసీపీ గెలుపుకు సహకరిస్తున్నారు.
అలాంటి వారిని ఇంకా ఉపేక్షించకూడదని బాబు ఫిక్స్ అయ్యారు..ఇప్పటివరకు ఎలాగోలా భరించారు…ఇక నుంచి వారికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకూడదని, అసలు కొందరికి టికెట్లు కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడి…పార్టీకి డ్యామేజ్ చేయాలని చూస్తే…వారిని మొహమాటం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాబు చూస్తున్నారు. మొత్తానికైతే బాబులో బాగా మార్పు వచ్చింది..మరి కోవర్టులకు చెక్ పెట్టేస్తారో లేదో చూడాలి.