నేడు గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈరోజు ( సోమవారం) సాయంత్రం 4 గంటలకుసాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు వైయస్ షర్మిల. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర మంగళవారానికి వాయిదా పడినట్లు వైయస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈనెల 9 నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ లో షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే..బంగారు తెలంగాణలో బతకడమే పాపం చేసావని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. నిన్న మెదక్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై షర్మిల స్పందించారు. ఈ రైతు సెల్ఫీ వీడియో KCR దౌర్భాగ్య పాలనకు నిదర్శనం. తాతల తండ్రుల నుంచి పోడు చేసుకొంటున్న భూములను లాక్కొంటే, దొర పాలనలో మాకు బతుకు లేదని సెల్ఫీ వీడియో తీసుకొని మరీ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.