BJPకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా? – వైఎస్ షర్మిల

-

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై వైఎస్‌ షర్మిల స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి,పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న BJPకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా? దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని బుద్ధి వచ్చిందా? అంటూ బీజేపీకి చురకలు అంటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొని, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు. అని మండిపడ్డారు.

ఊరికో ఎమ్మెల్యేను పెట్టి, మండలానికి ముగ్గురు మంత్రులను పెట్టి.. మద్యం, మనీ పంచి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్లను బెదిరించి, ఫామ్ హౌస్ డ్రామా ఆడి.. కేవలం 10వేల ఓట్లతో గెలిచిన ఎన్నిక గెలుపేనా? ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, హత్య చేసి, గెలిచామని సంబురాలు చేసుకోడానికి సిగ్గుండాలి కదా KCR గారు? అని నిప్పులు చెరిగారు. అధికార పక్షం పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు అమ్ముడుపోయినా.. ప్రజలకు YSR తెలంగాణ పార్టీ అండగా ఉంటుంది. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతుంది. పేదల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news