కరోనా దెబ్బకు ఏమి లేని పెదోడు అప్పులు చేసి ఆగమవుతున్నారు అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు. ఉన్న భూమి అమ్ముకొని ఎట్లా బ్రతకాలి చంద్రశేఖరా అంటున్నారు అని ఆమె ఎద్దేవా చేసారు. అయ్యా కేసీఆర్ సార్..ఇప్పటికైనా కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చండి అని ఆమె కోరారు. పేదలను అప్పుల భారిన పడకుండా చూడండి అని షర్మిల విజ్ఞప్తి చేసారు.
కరోనా భాద్యతలను కెసిఆర్ దొర చేతులు దులుపుకున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల మీద దాదాపు 150కోట్ల భారం పడుతుంది అని ఆమె అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి లు అడ్డగోలు దోపిడీ తో బతుకులు బజార్ న పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఉన్నోడు పెదోడు అవుతుంటే…కాస్తో కూస్తో సంపాదించినోడు ప్రాణాలు నిలుపుకునేందుకు ఖర్చు పెడుతున్నారు అని అన్నారు.