ఆరోగ్య నిపుణుల ప్రకారం చిన్న వయసులోనే సరైన పోషకాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందువల్లనే చాలా మంది తల్లిదండ్రులు చిన్న వయసులో చిన్న పిల్లలకు అన్ని రకాల ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. పిల్లలకు ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, మెగ్నీషియం తో పాటు హెల్తీ ఫ్యాట్స్ కూడా అంతే అవసరం. మరి ఎటువంటి ఆహారాన్ని పిల్లలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఇప్పుడే దీనిని చూడండి.
నట్స్ :
ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని బాదంను పిల్లలకు ఇవ్వాలి. దానివల్ల పిల్లల మెమరీ మరియు మెంటల్ డెవలప్మెంట్ బాగుంటుంది. బాదంలో చాలా రకాల మినరల్స్, విటమిన్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో అవసరం.
గుడ్లు:
గుడ్లలో ప్రోటీన్ మరియు ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. పిల్లలు స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రతిరోజు ఎగ్స్ ను డైట్ లో భాగంగా చేర్చాలి. గుడ్లలో ఉండే విటమిన్ డి వల్ల ఎముకలలో క్యాల్షియంని తీసుకుంటాయి. ఈ విధంగా ఎగ్స్ సహాయపడతాయి.
డైరీ ప్రొడక్ట్స్:
వివిధ ఆహార పదార్థాల ద్వారా ప్రోటీన్ ను అందించగలం. అయితే కాల్షియంను డైరీ ప్రొడక్ట్స్ ద్వారా అందించాలి. ఎముకలు సరైన విధంగా తయారవడానికి మరియు దృఢంగా ఉండడానికి కాల్షియం ఎంతో అవసరం. పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అంతేకాదు హైట్ పెరగడానికి మరియు కండరాలు దృఢంగా ఉండడానికి కూడా డైరీ ప్రొడక్ట్స్ అవసరమే.