కేసీఆర్ పాలన పోవాలి..వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని వైయస్ షర్మిల అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా..అచ్చంపేట నియోజక వర్గం భారీ వర్షంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో వర్షంలోనే షర్మిల కు స్వాగతం పలిపారు గ్రామస్థులు.
ఈ సందర్భంగా…YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ…భారీ వర్షంలో సైతం ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సంక్షేమం కోసమే పార్టీ పెట్టాం.. వైఎస్సార్ పథకాలను మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తానని పేర్కొన్నారు.
8 ఏళ్లుగా తెలంగాణ లో కేసీఅర్ ఏ వర్గానికి న్యాయం చేయలేదని.. కేసీఅర్ ప్రతి పథకం మోసమే అని ఫైర్ అయ్యారు. వైఎస్సార్ 5 ఏళ్లలో 46 లక్షల పక్కా ఇళ్లులు కట్టించారు….కేసీఅర్ కనీసం 10 వేల ఇళ్లులు కూడా కట్టించలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్,ఆరోగ్య శ్రీ కేసీఅర్ నిర్వీర్యం చేశారన్నారు.