కారు-కమలం గేమ్..కాంగ్రెస్ అవుట్?

-

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ప్రధాన ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే…రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం నడుస్తోంది. అలాగే రెండు పార్టీల నేతలు…ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది…దీంతో తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్ నడుస్తుందనే పరిస్తితి వచ్చింది. మరి టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ఫైట్ ఉంటే కాంగ్రెస్ పరిస్తితి ఏంటి అనే డౌట్ వస్తుంది.

ఆ పార్టీ బలం తగ్గిపోయిందా? ఇప్పటివరకు రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇకపై మూడో స్థానానికి పరిమితం అవుతుందా? అని చర్చలు కూడా నడుస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందా? ప్రస్తుతానికైతే ఆ పరిస్తితి లేదనే చెప్పొచ్చు. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది…బీజేపీ కంటే ఎక్కువగానే ఆ పార్టీకి బలం ఉంది. దాదాపు 60 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు ఉన్నారు…అలాగే 100 స్థానాల్లో బలమైన క్యాడర్ ఉంది. మరి ఇంత ఉండి కూడా కాంగ్రెస్ ఎందుకు రేసులో వెనుకబడింది అంటే…దానికి కారణం టీఆర్ఎస్-బీజేపీలు ఆడుతున్న పోలిటికల్ గేమ్ కారణమని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి.. తెలంగాణలో పశ్చిమ బెంగాల్‌ మోడల్‌ను అమలు చేస్తున్నాయని, రెండు పార్టీల మధ్యే పోలింగ్‌ పోలరైజేషన్‌ జరిగి.. కేసీఆర్‌ అధికారం నిలబడాలి, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ రావాలి అన్నదే పీకే వ్యూహమని.. అంతా పీకే ప్లాన్ ప్రకారమే నడుస్తుందని అంటున్నారు. అంటే కేసీఆర్..బీజేపీని టార్గెట్ చేసి…ఆ పార్టీని పెంచుకుంటూ వచ్చారని, దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కొన్ని బీజేపీకి వెళ్ళేలా చేసి..కాంగ్రెస్‌ని దెబ్బకొట్టి మళ్ళీ అధికారం దక్కించుకోవాలన్నదే కేసీఆర్ ప్లాన్ అని చెబుతున్నారు. అయితే రేవంత్ చెప్పే మాటల్లో కాస్త వాస్తవం కనిపిస్తోంది…బలంగా ఉన్న కాంగ్రెస్‌ని వదిలి బీజేపీని టార్గెట్ చేసి, ఆ పార్టీని బలోపేతం చేసి, ఓట్లు చీల్చేలా చేసి టీఆర్ఎస్ లబ్ది పొందేలా పీకే ప్లాన్ చేసినట్లే తెలుస్తోంది. మరి చూడాలి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news