ఏపీలో రేపటి నుండి అమలు కానున్న వైఎస్సార్ చేయూత పథకానికి ఎవరెవరు అర్హులు అనే విషయం మీద ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఉద్దేశించిన ఈ వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా 18,750 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
అలా మొత్తం వచ్చే నాలుగేళ్ల కాలంలో మొత్తం 75 వేల రూపాయలు వారికి అందేలా ఈ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందని ముందు నుండీ ప్రభుత్వం ప్రచారం చేసింది. తాజాగా వైఎస్సార్ చేయూత పథకం లబ్దిదారులుగా ప్రతి ఏడాది ఆగస్టు 12 నాటికీ 45 ఏళ్లు నిండిన వారికి ఈ పథకం వర్తించనుంది. పథకం మద్యలో 60 ఏళ్లు నిండితే వారికి అప్పటి నుండి పథకం వర్తించదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.