వైసీపీ స్కెచ్..టీడీపీ రివర్స్..ఓటు మారుతుందా?

-

రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు అనేది సహజమే..ఒక పార్టీ వేసే ఎత్తుకు..ప్రత్యర్ధి పార్టీ పై ఎత్తు వేసి చిత్తు చేస్తూ ఉంటుంది. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి..అక్కడ వైసీపీ హవానే నడుస్తోంది. ఎక్కడ కూడా టి‌డి‌పికి ఛాన్స్ ఇవ్వడం లేదు. వైసీపీ ఎత్తులకు టి‌డి‌పి చిత్తు అవుతూ వస్తుంది. టి‌డి‌పిని దెబ్బ మీద దెబ్బ కొడుతూ వైసీపీ ముందుకెళుతుంది. కానీ కొన్ని రోజుల నుంచి ఏపీ రాజకీయాలు రివర్స్ అయ్యాయి. అధికారంలో ఉన్న వైసీపీని టి‌డి‌పి దెబ్బకొట్టడం మొదలుపెట్టింది.

మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని టి‌డి‌పి ఓడించింది. అవే అనుకుంటే అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో వైసీపీని గెలవకుండా నిలువరించి టి‌డి‌పి సత్తా చాటింది. 7 స్థానాలని కైవసం చేసుకుందామని జగన్..7 గురు అభ్యర్ధులని రంగంలోకి దింపారు..కానీ టి‌డి‌పి ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపింది. అయితే అంతా వైసీపీ 7 స్థానాల్లో గెలిచేస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా టి‌డి‌పి షాక్ ఇచ్చింది..ఒక స్థానంలో గెలిచింది.

అయితే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు వేశారు. దీంతో టి‌డి‌పి గెలిచింది. ఇక ఈ అంశంపై టి‌డి‌పిని నెగిటివ్ చేయాలని వైసీపీ స్కెచ్ వేసింది..నలుగురు ఎమ్మెల్యేలని డబ్బులు పెట్టి కొన్నారని, తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని చెప్పి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. సస్పెండ్ వల్ల ఆ ఎమ్మెల్యేలకు ఇంకా మేలు చేశారు.

ఇక డబ్బులు పెట్టి కొన్నారా? అనే ప్రశ్నలకు టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యేని వైసీపీ తీసుకుంది. వారికి ఎంత ఇచ్చారని ప్రశ్నలు వస్తున్నాయి. ఈరోజుల్లో అధికార పార్టీల్లో ఉంటేనే లాభం అనే సంగతి అందరికీ తెలుసు. అలాంటప్పుడు వారు ప్రతిపక్షానికి ఓటు వేశారంటే బలమైన కారణాలు ఉండే ఉంటాయి. ఇప్పుడు జనసేన నుంచి తీసుకున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేత ఒక స్క్రిప్ట్ నడిపిస్తున్నారు..తనకు టి‌డి‌పి 10 కోట్లు ఆఫర్ చేసిందని అంటున్నారు.

అయితే జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లినందుకు రాపాకకు ఎంత ఇచ్చారని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే వైసీపీ స్కెచ్ వేస్తే..దానికి టి‌డి‌పి రివర్స్ చెక్ పెడుతుంది. మరి ఈ పరిణామాల వల్ల ఓట్లు మారతాయనేది చెప్పడం కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news