వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని కానుందన్నారు. లీగల్ ఇష్యూస్ కారణంగా రాజధానిగా విశాఖ ఆలస్యమవుతోందన్నారు. వైజాగ్ – వన్ ఇండియా కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ కార్యక్రమంకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల ప్రజలు జీవించేందుకు అనువైన ప్రాంతం విశాఖ అని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజలు భాగస్వామ్యం ఉందని, త్వరలోనే విశాఖ పరిపాలన రాజదాని కాబోతుందన్నారు. లీగల్ ఇష్యూస్ వలన కాస్త ఆలస్యం అవుతుందని, రెండు మూడు నెలల్లో సీఎం విశాఖ రాబోతున్నారని ఆయన వెల్లడించారు. దక్షిణ భారత దేశానికి ముంబయి వంటిది విశాఖ అని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అంతేకాకుండా.. ‘చంద్రబాబు మీద దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు.. చంద్రబాబు బలం ఏంటో 2019 ఎన్నికల్లో చూసాము.. చంద్రబాబు ఏమైనా పెద్ద బలవంతుడా దాడులు చేయడానికి.. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మూడేళ్లపాటు ఇంట్లోనే ఉన్నారు.. ఏడాది నుంచి బయటికి వచ్చి టిడిపి పై దాడి అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తరహాలోనే ప్రజలను రెచ్చగొడుతున్నారు.. పవన్ కళ్యాణ్ కు ఒక విధానం అంటూ లేదు. ఒకసారి సీఎం పదవి వద్దంటాడు మరోసారి పదవి కావాలంటాడు..’ అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.