చిన్న దొర చెప్పేవి శ్రీ రంగ నీతులు.. చేసేవి పనికి మాలిన పనులు : షర్మిల

-

మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ఇవాళ ఆమె మాట్లాడుతూ… స్వరాష్ట్రంలో సర్కారీ భూములపై చేస్తున్న దందాకు పొంతనే లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ పని కాకుంటే మీ 9 ఏళ్ల పాలనలో 38 వేల ఎకరాలు ఎందుకు అమ్మారని ప్రశ్నించారు. చిన్న దొర చెప్పేవి శ్రీ రంగ నీతులు.. చేసేవి పనికి మాలిన పనులని విమర్శించారు. భూములు అమ్మొద్దని ఉద్యమంలో చెప్పిన ఊకదంపుడు మాటలకు.. వెతికి మరీ ఫర్ సేల్ బోర్డులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల.

ys sharmila: Telangana: YSRTP chief YS Sharmila sends trolley filled with  damaged crops to CM KCR - The Economic Times Video | ET Now

ఫైర్మరో 50 వేల ఎకరాలు అమ్మేందుకు కసరత్తు ఎందుకు చేస్తున్నట్లు..? తెచ్చిన అప్పులు కమీషన్ల కింద.. రాష్ట్ర ఆమ్దానీ విలాసాల కింద ఖర్చు పెడుతున్న రాబందులకు, భూములు అమ్మకపోతే పొద్దు గడవదని ధ్వజమెత్తారు. అందుకే బీఆర్‌ఎస్ అంటే ‘భూములమ్మే రాష్ట్ర సమితి’ అని ఆమె ఘాటుగా విమర్శించారు. సర్కారీ భూములు మింగేసే ‘భూ భకాసుర రాష్ట్ర సమితి’ అని.. భవిష్యత్ అవసరాలకు భూములు లేకుండా కొల్లగొట్టే విధంగా కేసీఆర్ ప్లాన్ వేశారని ఆరోపించారు. బందిపోట్లకు బుద్ధి చెప్పకపోతే రేపు రాష్ట్రాన్ని సైతం వేలం వెయ్యక మానరని షర్మిల మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news