ముఖేశ్‌ అంబానికి జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ

-

కేంద్ర ప్ర‌భుత్వం భార‌త వ్యాపార దిగ్గ‌జం రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి భ‌ద్ర‌త‌ను పెంచింది. ప్ర‌స్తుతం జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న ముఖేశ్‌కు ఇక‌పై జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం . నిఘా సంస్థ‌లు ఇచ్చిన నివేదిక ప్ర‌కార‌మే ముఖేశ్ భ‌ద్ర‌త‌ను జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీకి పెంచిన‌ట్లు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది కేంద్ర ప్ర‌భుత్వం. గ‌తేడాది ముంబైలోని ముఖేశ్ ఇంటి వ‌ద్ద పేలుడు ప‌దార్థాల‌తో కూడిన వాహ‌నాన్ని పోలీసులు గుర్తించిన సంగ‌తి తెలిసిందే.

Mukesh Ambani celebrates his birthday today | RITZ

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ముఖేశ్ భ‌ద్ర‌త‌పై కేంద్ర ప్ర‌భుత్వం విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న భ‌ద్ర‌త‌ను జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీకి పెంచాల‌ని తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. జ‌డ్ ప్ల‌స్ కేటగిరీ భ‌ద్ర‌త‌లో భాగంగా ముఖేశ్‌కు 55 మందితో భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు. వీరిలో 10 మందికి పైగా ఎన్ఎస్‌జీ క‌మెండోల‌తో పాటు ఇత‌ర పోలీసు అధికారులు ముఖేశ్‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news