తెలంగాణ రికార్డు… ఒక్క కోవిడ్ మరణం లేకుండా..

Join Our Community
follow manalokam on social media

దాదాపు 9నెలల తర్వాత తెలంగాణలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. గురువారం రోజు మొత్తం ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. 2020 మే 8వ తేదీన తెలంగాణలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. అప్పటికి కరోనా మరణాలు కేవలం 30మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం 9నెలల తర్వాత కరోనా మరణం లేని రోజు గురువారం గడిచింది. ప్రస్తుతానికి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1613కి చేరింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.96,134గా ఉంది.

ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావ్ వెల్లడించారు. గురువారం రోజు మొత్తం 29,755 టెస్టులు చేయగా, 146పాజిటివ్ గా వచ్చాయి. మొత్తం ఇప్పటి వరకు 82.1లక్షల టెస్టులు జరిగాయి. కంటోన్మెంట్ జోన్లు కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేయడంతో మరిన్ని కేసులు తగ్గే అవకాశం ఉంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....