ZTE Axon 40 Ultra స్మార్ట్ ఫోన్..64 మెగా పిక్సెల్ కెమేరా..ధర ఎంతంటే..! 

-

ZTE Axon 40 Ultra స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది..లగ్జరీ స్మార్ట్ ఫోన్ లిస్ట్ లో ఈ మొబైల్ కూడా చేరింది. అయితే ఈరోజు ఈ ఫోన్ ఫీచర్స్, కెమేరా క్వాలిటీ, ధర ఎంత ఉన్నాయో ఓ లుక్కేద్దాం..!

జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా ధర

8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధరను 4,998 యువాన్లుగా (సుమారు రూ.57,500) నిర్ణయించారు.
మిగతా వేరియంట్ల ధర ఇంకా ప్రకటించలేదు.
బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందో లేదో ఇంకా స్పష్టత లేదు.

కెమేరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రధాన కెమెరా కాగా… మరొకటి వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకోటి పెరిస్కోపిక్ టెలిఫొటో లెన్స్. ముందువైపు అండర్ డిస్‌ప్లే కెమెరాను జెడ్‌టీఈ ఇందులో అందించడం విశేషం.

జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా హైలెట్స్..

ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. డీటీఎస్ ఎక్స్ అల్ట్రా టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రాలో ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించడం విశేషం.
ఈ ఫోన్ ఒకవేళ ఇండియాలో లాంచ్ అయినా ధర దాదాపు అంతే ఉండవచ్చు. అయితే సేల్ ఆఫర్లు ఏమైనా ప్రకటించి.. రెండు మూడు వేలు డిస్కౌంట్ ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా..!

Read more RELATED
Recommended to you

Latest news