ముగిసిన యాదగిరి నర్సన్న జయంతి ఉత్సవాలు

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాద్రాద్రీశుడి కోవెలలో జయంతి ఉత్సవాలు అంగ రంగ వైభవంగా జరిగాయి. యాదగిరిగుట్ట, పాతగుట్ట ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన ఉత్సవాలకు ఆదివారం పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం, నృసింహ జయంతి, నారసింహ ఆవిర్భావ ఘట్టంతో పరిసమాప్తి పలికారు అర్చకులు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జయంతి ఉత్సవాలను అర్చకులు వైభవోపేతంగా జరిపారు. టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి స్వామివారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Yadadri: నేటితో ముగియనున్న నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు - NTV

ఆదివారంతో జయంతి ఉత్సవాలు పరిసమాప్తం కావడంతో.. సోమవారం నుంచి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. భక్తులు నిర్వహించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.30,06,220 ఆదాయం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news