వరుడి పైజామా జారడం… వధువు ముసిముసి నవ్వులు

-

పెళ్లి వేడుకల్లో సాధారణంగా అన్ని పనులు సరిగ్గా లోటుపాట్లు లేకుండ జరిగేందుకు ప్రతిమొక్కరు నానా కష్టాలు పడటం సహజమే. అలాగే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండ ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కొన్ని సార్లు అనూహ్య సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పెళ్లిళ్లలో ఊహించని కార్యాలు కూడా జరగడం సహజం. అలాంటి ఒక సంఘటన ఇటీవల ఒక పెళ్లి వేడుకలో చోటు చేసుకుంది . వరమాల సమయంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. తొలుత వధువు, వరుడి మెడలో దండ వేస్తుంది. అనంతరం వరుడు ముందుకు వచ్చి వధువు మెడలో దండ వేస్తాడు. అయితే అప్పుడు వరుడు ధరించిన పైజామా కిందకు జారుతుంది.

Watch | వరమాల సమయంలో జారిన వరుడి పైజామా.. వధువు ఎలా స్పందించిందంటే!

దీనిని గమనించిన వధువు ముసిముసిగా నవ్వుతుంది. కాగా, పెళ్లికుమార్తె నవ్వడం చూసిన పెళ్లికుమారుడు తన పైజామా జారినట్లు తెలుసుకుంటాడు. వెంటనె పైజామా పైకి లాక్కుంటాడు. పెళ్లి వేదిక నుంచి పక్కకు వెళ్లి పైజామాను సరి చేసుకుంటాడు. ఇది చూసి ఆ వధువు పగలబడి నవ్వుతూనే ఉంటుంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. వరమాల సందర్భంగా వరుడి పైజామా జారడంపై భారీగా కామెంట్లు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news