సీఎం జగన్‌ ఫ్రాన్స్‌ పర్యటన ఖరారు..

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెలాఖరులో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఇటీవలె దావోస్‌కు వెళ్లింది అధికారిక పర్యటన అయితే… ఇప్పుడు ఫ్రాన్స్ కు వెళ్తున్నది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. జగన్ పెద్ద కూతురు హర్షిణి రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్ లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఆమె చదువుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 2న బిజినెస్ స్కూల్లో కాన్వొకేషన్ కార్యక్రమం జరగనుంది. అయితే.. తన కూతురు కాన్వొకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరుకానున్నారు. అంతేకాకుండా జగన్ చిన్న కుమార్తె లండన్ లో చదవుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇది పూర్తి వ్యక్తిగత పర్యటనగా సీఎంవో వర్గాలు వెల్లడించారు.

CBI case against Jagan back to square one?

 

Read more RELATED
Recommended to you

Latest news