ఆ రాశుల వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..

-

మన అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము..ఒకసారి దరిద్రం మన తల మీద ఉంటే బంగారం కూడా ఇత్తడి అయిపోతుంది.అదే అదృష్టం ఉంటే అనుకోకుండా ధన లాభం వస్తుంది..రాశులను బట్టి కొంతమంది అదృష్టం ఏంటో పరిష్కారం వెతుకుతారు. మరి ఈరోజు ఏ రాశుల వారికి అదృష్టం ఎలా ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

horoscope

మే 3 రాశి ఫలాలు..

మేషం: రుణయత్నాలు చేస్తారు.అనుకున్న  కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఎటు చూసినా చికాకులు ఎదురవుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో లాభాలు ఉండవు. ఉద్యోగులకు పనిభారం.

వృషభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది.ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి..ఈరోజు వీరికి ధనలాభం ఉంటుంది.

మిథునం: వ్యయప్రయాసలు.. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల తో చికాకులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు చేస్తారు.

కర్కాటకం: కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి, పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. విందువినోదాలకు వెళతారు.. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి..

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు. సోదరులతో మాటపట్టింపులు వస్తాయి.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. ఇంట్లో, బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి..

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యతను పెంచుకుంటారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగోన్నతి జరుగుతుంది. దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు.

ధనుస్సు: కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతాయి. అత్యంత కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలలొ పాల్గొంటారు.

మకరం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. శ్రమాఆధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు ఎక్కువ. దూరప్రయాణాలు. దైవదర్శనాలు చేస్తారు..ఈరోజు అంత మంచి రోజు కాదు..

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు బాధ్యతలు అధికం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి..

మీనం: సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం..ఈరోజు ఎం చేసిన మంచే జరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news