సెప్టెంబర్ 16: ప్రపంచ ఓజోన్ దినోత్సవం.. ఓజోన్ పొర గురించి తెలుసుకోండి..

ఓజోన్.. మూడు ఆక్సిజన్ పరణాణువులు కలిస్తే ఏర్పడే మూలకం. భూమి నుండి 19మైళ్ళ ఎత్తు దూరంలో ఉన్న ఈ ఓజోన్ పొర మానవాళిని భూమి మీద నివాసం ఉండడానికి ఎంతో సహాయపడుతుంది. సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు డైరెక్టుగా భూమి మీద పడకుండా ఉండేందుకు ఓజోన్ పొర అవసరం. ఒకవేళ ఓజోన్ పొర లేకపోతే సూర్యుని నుండి వచ్చిన అతినీల లోహిత కిరణాలు డైరెక్టుగా మనమీద పడి చర్మసంబంధిత క్యాన్సర్ లకి కారణమవుతాయి. అంటే ఓజోన్ పొర ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుందన్నమాట.

ఐతే గత కొన్నేళ్ళుగా భూమి మీద పెరుగుతున్న కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఇప్పటికే చాలాభాగం ఓజోన్ పొర దెబ్బతిందని అన్నారు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ల నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరకి రంధ్రం పడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమి మీద వేడి విపరీతంగా పెరిగి మానవాళి మనుగడకు ఇబ్బంది వాటిల్లనుంది. అందువల్ల ఓజోన్ పొరని రక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో వియన్నా కన్వెన్షన్ అనే పద్దతి అడాప్ట్ చేసుకున్నారు.

1985లో వియన్నా కన్వెన్షన్ మొదలైంది. దీని ప్రకారం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఓజోన్ పొరకి ఇబ్బంది కలిగించే ఎలాంటి పదార్థాలను గాలిలోకి వదలకూడదని నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా 2019లో కిగాలి సవరణ కూడా వచ్చి చేరింది. కిగాలి సవరణ ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కలుగజేసే గ్రీన్ హౌస్ వాయువులని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 16వ తేదీన ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఓజోన్ పొర పట్ల అవగాహన కల్పిస్తూ, మానవాళి మనుగడ సాగాలంటే ఓజోన్ పొరని రక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో అవగాహన కార్యక్రమాలు చేపడతారు.

ప్రకృతి బాగుంటే అందులో భాగమైన మనుషులు బాగుంటారు. ప్రకృతికి ఏమాత్రం నొప్పి తెచ్చిపెట్టినా అది పెట్టే అరుపుకి మనమందరం పోవాల్సిందే. సో.. ప్రకృతిలో భాగమైన ఓజోన్ పొరకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అందుకే ఈ సంవత్సరం ఓజోన్ పొర దినోత్సవం సందర్భంగా ఓజోన్ మన జీవితం కోసం అనే నినాదాన్ని ఇచ్చారు.