జులై 15న మూన్ మిషన్ చంద్రయాన్ 2 ప్రయోగం..!

-

మూన్ మిషన్ చంద్రయాన్ 2 జులై 15 తెల్లవారుజామున 2. 51 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ ద్వారా రూపొందించిన జీఎస్‌ఎల్వీ మార్క్ 3 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

మూన్ మిషన్ చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మిషన్‌ను ప్రారంభించింది. ఈ ప్రయోగాన్ని జులై 15, 2019న చేపడుతున్నట్టు ఇస్రో చైర్మన్ డా. కే శివన్ వెల్లడించారు. ఈ ప్రయోగం తయారీకి దాదాపు 1000 కోట్లు ఖర్చయినట్లు ఆయన తెలిపారు.

మూన్ మిషన్ చంద్రయాన్ 2 జులై 15 తెల్లవారుజామున 2. 51 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ ద్వారా రూపొందించిన జీఎస్‌ఎల్వీ మార్క్ 3 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. చంద్రయాన్ 2 మూన్ మిషన్‌లో భాగంగా… చంద్రుడిపైన ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రవేశపెట్టనున్నారు.

చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా రూపొందించిన రాకెట్ బరువు 3447 కిలోలు. వీటిలోని ప్రొపెల్లర్ బరువే 1179 కిలోలు. జులై 15న ప్రయోగం ప్రారంభమయ్యాక… ల్యాండర్ 2019, సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఇస్రో గతంలోనే చంద్రయాన్ 1 రాకెట్‌ను చంద్రుడి మీదికి ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news