యాపిల్ ఓ సరికొత్త ఫీచర్‌కు శ్రీకారం చుట్టింది. దీంతో చైల్డ్ ఫోర్నోగ్రఫీ( Child Pornography )కి చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ కొత్త అప్డేట్‌తో ఐఓఎస్ ఫొటో లైబ్రరీలలో చైల్డ్ పోర్నోగ్రఫీ ఫొటోలను గుర్తించేందుకు వీలుగా ఫొటో ఐడెంటిఫికేషన్ టూల్స్‌ను విడుదల చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది.
కొంతకాలం క్రితం చైల్డ్ పోర్నోగ్రఫీ ఆందోళనలు రేకెత్తిస్తున్న సమయంలో యాపిల్ ఈ పనికి పూనుకుంది. దీని వల్ల పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడానికి తోడ్పాడుతుంది. ఐఫోన్‌లు ఫోటో హ్యాషింగ్ టెక్నాలజీని వినియోగించి గుర్తించవచ్చట. అయితే, యాపిల్ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఐఫోన్ ప్లాన్ చేస్తున్న డిటెక్షన్ సిస్టమ్ అనేది ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌లపై నిఘాపెట్టే కీలక ఫీచర్‌గా మారనుందని యాపిల్ అధికారి మాథ్యూ అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్కానింగ్ సిస్టమ్‌లను ఎండ్–టు–ఎండ్ ఎన్ క్రిప్షన్ మెసేజింగ్ సిస్టమ్‌లకు జోడించడం అనేది ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రశ్నలకు దారితీస్తుందన్నారు.
ఈ స్కానింగ్ సిస్టమ్ చైల్డ్ పోర్నోగ్రఫీకి చెక్ పెట్టేందుకు ఒక ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇది పర్సనల్ ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్యాలరీలోని ఫొటోలన్నింటినీ స్కాన్ చేయడం అనేది వ్యక్తిగత జీవితంలో చొరబడటమే. ఈ ఫీచర్ గానీ అందుబాటులోకి వస్తే.. యాపిల్ యూజర్ల ఫోన్, లాప్ టాప్స్‌లలో పర్సనల్ ప్రైవసీకి భంగం కలుగుతుంది.